తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని దర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 13,2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేరళలోని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 13,2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని సందర్శించారు. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Read this also..Quality Power Electrical Equipments Limited to Launch IPO on February 14, 2025

ఇది కూడా చదవండి..శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీ పరశురాముని వద్ద పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కండన్ సోమహరిపాద్ గారు పవన్ కళ్యాణ్ గారి గోత్రనామంతో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు.

శివాలయంలో భక్తి పారవశ్యంలో పవన్ కళ్యాణ్
తిరువల్లం ఆలయంలో ఉన్న ఉపాలయాలైన బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్య మూర్తి, వేద వ్యాస, శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అక్కడ జరుగుతున్న భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

Read this also..Muscat Clearing and Depository Partners with TCS to Enhance Market Infrastructure and Customer Experience

Read this also..Axis Bank Introduces Comprehensive Initiatives for Pilgrims at Kumbh Mela 2025

ఈ దర్శనంలో పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు కృష్ణన్ నంబూద్రి, శ్రీరాగ్, హరిదేవ్, హరిహరన్ సహా ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సభ్యులు స్వాగతం పలికారు.

About Author