గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “పెద్ది” ఫస్ట్ షాట్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ షురూ..

వారాహి మీడియా డాట్ కామ్ ,ఏప్రిల్,5th,2025:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సంచలన దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది”. ఈ సినిమాకు

వారాహి మీడియా డాట్ కామ్ ,ఏప్రిల్,5th,2025:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సంచలన దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది”. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ విడుదలకు తుది మిక్సింగ్ పూర్తయ్యింది. చిత్ర బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విజువల్ గ్లింప్స్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు విడుదల చేయనున్నారు.

🔗 ఫస్ట్ షాట్ అనౌన్స్‌మెంట్ – Vriddhi Cinemas ట్వీట్

బుచ్చి బాబు సానా మరియు మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ ఫస్ట్ షాట్‌కు సంబంధించిన సౌండ్ మిక్సింగ్ పూర్తి చేశారు. ఈ ఆదివారం విడుదలకానున్న ఈ ఫస్ట్ షాట్‌ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భవ్యంగా నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

పెద్ది ఫస్ట్ షాట్ – దాని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మరియు టెక్నికల్ స్టాండర్డ్స్—all set to blow your mind! బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఈ ఫస్ట్ గ్లింప్స్ పవర్ ప్యాక్డ్‌గా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు మరియు దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.

ఇంకా ఎన్నో అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం ‘పెద్ది’ ఫస్ట్ షాట్ కోసం మాంచి అంచనాలతో రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!

About Author