Health

తలసీమియా బాధితుల కోసం కామినేని ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 22,2025: తల్లిదండ్రుల్లో  ఎవరికైనా తలసీమియా మైనర్ ఉంటే, పిల్లలకు తలసీమియా మేజర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.  ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు తెచ్చే ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే, ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించుకోవడం, మందులు వాడడం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, పిల్లలకు తలసీమియా సంబంధిత పరీక్షలు చేసేందుకు నగరంలోని కామినేని ఆస్పత్రిలో ఉచిత హెమటాలజీ శిబిరం నిర్వహిస్తున్నారు.  ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, హెమటాలజిస్టు, జెనెటిక్ వైద్య నిపుణులు పాల్గొని పిల్లలకు పలు పరీక్షలు చేస్తారు. ఈ శిబిరంలో పాల్గొని, ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలనుకునేవారు 8985450534 అనే నంబరులో సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా పిల్లల వైద్యవిభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎస్. నరసింహారావు మాట్లాడుతూ...“పిల్లలు ఎప్పుడూ అలసటగా, బలహీనంగా కనపడుతున్నా, ముఖం పసుపు లేదా తెల్లగా మారినా, ఎదుగుదల ఆలస్యంగా అనిపిస్తున్నా, పొట్ట ఉండాల్సిన దానికంటే పెద్దగా కనిపించినా, ముఖం ఎముకల ఆకృతి అసాధారణంగా మారినా, తరచు జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు వస్తున్నా, మూత్రం ముదురు రంగులో ఉంటున్నా వెంటనే తల్లిదండ్రులు గమనించి తలసీమియా సంబంధిత వైద్య పరీక్షలు చేయిచాలి” అని సూచించారు.  ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స ప్రారంభిస్తే పిల్లల ప్రాణాలు కాపాడగలమని ఆయన చెప్పారు.  సమావేశంలో ఇంకా కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ కంచన్ ఎస్.చన్నావర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్.జయంతి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీనివాస్, జెనెటిక్స్, మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనీ క్యూ హసన్, జెనెటిక్స్ కౌన్సిలర్ డాక్టర్ శ్రీలత కొమాండూర్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.వివేకానంద్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అన్నే పునీత్ బాబు తదితరులు పాల్గొని.. పిల్లలందరికీ పూర్తి ఉచితంగా హెమోగ్లోబిన్, హెమోగ్లోబినోపతి స్క్రీనింగ్ (హెచ్పీఎల్సీ) పరీక్షలు చేస్తారు.

నర్సుల సేవలు అమూల్యం: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే 12,2025: వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్‌ ఆదర్శంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న...

“ప్రతి అమ్మాయి హెచ్పీవీ టీకా తీసుకోవడం అత్యవసరం: గ్రేస్ క్యాన్సర్ ఫౌండర్”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: క్యాన్సర్ పై విజయం సాధించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ , మ్యాక్సిమస్ ఇండియా...

మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో (ECMO) సేవలు: ప్రాణరక్షణలో ఆధునిక పరిష్కారం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, 28 ఏప్రిల్ 2025: అత్యాధునిక వైద్య సంరక్షణ అందించినప్పటికీ, కొన్ని తీవ్ర అనారోగ్య పరిస్థితులు వేగంగా దిగజారిపోతున్నాయి....

కావిటీస్‌కు చెక్… డాబర్ రెడ్ పేస్ట్‌తో దంత సంరక్షణ!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025:చిన్నా పెద్దా తేడా లేకుండా దంత సమస్యలు ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తున్నాయని డాక్టర్ సోనియా దత్తా...

బరువు తగ్గడానికి సహజ మార్గం: ది గుడ్ బగ్ నుంచి జీఎల్‌పీ-1 ఆధారిత విప్లవాత్మక సొల్యూషన్..

వారాహి మీడియా డాట్ కామ్ ,ఏప్రిల్5,2025:భారత్‌లో స్థూలకాయం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆరోగ్యానికి హాని కలిగించకుండా బరువు తగ్గించేందుకు సహాయపడే సహజసిద్ధమైన జీఎల్‌పీ-1 ఆధారిత మెటాబోలిక్ సిస్టంను...