హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్స్ ఆధునిక “పెయింట్ స్టూడియో” ప్రారంభం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ బిర్లా ఓపస్ పెయింట్స్, హైదరాబాద్‌లో తన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ బిర్లా ఓపస్ పెయింట్స్, హైదరాబాద్‌లో తన ఆధునిక “బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో”ను ప్రారంభించింది.
గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో విజయవంతంగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, ఈ స్టూడియో ప్రారంభం సంస్థ విస్తరణలో కీలక మైలురాయిగా నిలిచింది.
పెయింట్ మరియు డెకర్ పరిశ్రమను నూతన ఆవిష్కరణలతో రూపుమాపేందుకు, వినూత్న వినియోగదారుల అనుభవాలను అందించేందుకు బిర్లా ఓపస్ పెయింట్స్ కొనసాగుతున్న ప్రయాణంలో భాగంగా హైదరాబాద్ స్టూడియో ఒక ప్రధాన భాగస్వామిగా నిలుస్తోంది.
హైదరాబాద్‌లోని బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ స్టోర్‌కు భిన్నంగా డిజైన్ చేయబడింది. ఇది వినియోగదారులకు రంగులు, టెక్స్చర్స్, డిజైన్ల ప్రపంచాన్ని అన్వేషించేందుకు, వారి స్వంత అభిరుచులకు అనుగుణంగా సృజనాత్మక ప్రయాణాన్ని అనుభవించేందుకు ఒక కేంద్రంగా నిలుస్తుంది.
షేడ్ ఎంపిక, అప్లికేషన్ టెక్నిక్స్‌పై నిపుణుల సలహాతో పాటు, అడ్వాన్స్‌డ్ విజువలైజేషన్ టూల్స్ సాయంతో రంగులను రియల్ టైమ్‌లో పరిశీలించే అవకాశం కల్పించనుంది.
స్టూడియోలో పెయింట్స్‌తో పాటు వాల్ కవరింగ్స్, డిజైనర్ ఫినిషింగ్‌లు, స్పెషాలిటీ కోటింగ్‌లు వంటి విస్తృత పరిధిలో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 170కి పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న ఈ స్టూడియోలో, హైదరాబాద్ స్థానిక సంస్కృతి, వారసత్వానికి న్యాయం చేసే ప్రత్యేక షేడ్స్‌ను కూడా అందిస్తున్నారు.

ఈ సందర్భంగా బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ మిస్టర్ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో కేవలం ఒక రిటైల్ సెంటర్ కాదు; ఇది వినియోగదారులు తమ సృజనాత్మకతను అన్వేషించే, వ్యక్తీకరించే ప్రత్యేక అనుభూతి కేంద్రం. ఆధునిక సాంకేతికత, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే షేడ్స్ మిశ్రమంతో మేము పెయింటింగ్ అనుభవాన్ని మానవీయంగా, ఉత్తేజకరంగా మార్చుతున్నాం,” అని అన్నారు.
Read this Also…Birla Opus Paints Unveils First-of-Its-Kind Paint Studio in Hyderabad..
ఇది కూడా చదవండి… “ప్రతి అమ్మాయి హెచ్పీవీ టీకా తీసుకోవడం అత్యవసరం: గ్రేస్ క్యాన్సర్ ఫౌండర్”
ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్క్‌స్పేస్, నిపుణుల మద్దతుతో శాంపిల్స్, వనరులు స్టూడియోలో లభించనున్నాయి. వీటితోపాటు, నిపుణులచే నిర్వహించే “పెయింట్ క్రాఫ్ట్” పెయింటింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఈ కొత్త స్టూడియో ప్రారంభంతో, గృహ యజమానులు మరియు వృత్తిపరుల కోసం పెయింటింగ్ అనుభవాన్ని పూర్తిగా వ్యక్తిగతీకరించిన కొత్త దిశగా బిర్లా ఓపస్ ముందుకు సాగుతోంది. సంస్థ ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర నగరాల్లో కూడా త్వరలో మరిన్ని పెయింట్ స్టూడియోలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.