హైదరాబాద్‌లో 200వ క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన బిగ్ బౌల్ – 2028 నాటికి 500 వంటశాలల లక్ష్యం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 6, 2025: భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్న బౌల్-ఆధారిత క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్ బిగ్ బౌల్, హైదరాబాద్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 6, 2025: భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్న బౌల్-ఆధారిత క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్ బిగ్ బౌల్, హైదరాబాద్ అత్తాపూర్‌లోని M క్యూబ్ మాల్‌లో తన 200వ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించింది. లెనెక్సిస్ ఫుడ్‌వర్క్స్ భాగమైన బిగ్ బౌల్, భారతీయ,చైనీస్ బౌల్స్ విభాగంలో తన నేతృత్వాన్ని మరింత బలపరచుకుంటూ, క్లౌడ్ కిచెన్ రంగంలో వేగవంతమైన విస్తరణను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిగ్ బౌల్, రాబోయే మూడు సంవత్సరాల్లో 500 వంటశాలలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో విస్తరణపై దృష్టి పెట్టి, రుచికరమైన, వేగవంతమైన భోజన ఎంపికలను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

బిగ్ బౌల్, ఆర్థిక సంవత్సరం 2025 నాటికి రూ. 100 కోట్ల వార్షిక ఆదాయాన్ని (ARR) దాటింది. ఈ విజయం దాని బలమైన మార్కెట్ స్థానాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. 2026 తొలి అర్థభాగంలో రూ. 150 కోట్ల ARR మార్క్ చేరుకునే దిశగా ప్రయాణిస్తోందీ బ్రాండ్.

లెనెక్సిస్ ఫుడ్‌వర్క్స్ గరిష్ట విక్రయ లక్ష్యాలను సెట్ చేసుకోగా, మార్చి 2025 నాటికి రూ. 650 కోట్ల అమ్మకాలు, 2026 నాటికి రూ. 1000 కోట్ల అమ్మకాల రేటును చేరుకోవాలని యోచిస్తోంది.

ఈ మైలురాయిపై లెనెక్సిస్ ఫుడ్‌వర్క్స్ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ ఆయుష్ మధుసూదన్ అగర్వాల్ మాట్లాడుతూ, “200వ క్లౌడ్ కిచెన్ ప్రారంభించడం మా కోసం గొప్ప గర్వకారణం. దేశవ్యాప్తంగా అధిక నాణ్యత గల, రుచికరమైన బౌల్స్‌ను అందించాలనే మా సంకల్పానికి ఇది నిదర్శనం.

ఒకే వంటగది నుండి బౌల్-ఆధారిత QSR విభాగంలో నాయకత్వ స్థాయికి చేరుకున్న ప్రయాణం ఆశ్చర్యకరం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరిన్ని నగరాల్లో బిగ్ బౌల్‌ను విస్తరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” అని అన్నారు.

బిగ్ బౌల్, 2025లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్ఫూర్తి పొంది కొత్త రుచులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అలాగే, వినియోగదారుల అంకితభావాన్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన ప్రమోషన్లు, విలువైన ఆఫర్లు అందించడంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో సహకరించి, సరికొత్త కంటెంట్‌ను సృష్టించనుంది.

About Author