హావ్ మోర్ టీ నో మోర్ పఫ్స్ కార్యక్రమానికి అపూర్వ స్పందన

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వైజాగ్ జూలై 30,2024: పొగాకు వినియోగం వల్ల కలిగే విషపూరిత ప్రభావాలను గురించి నొక్కిచెప్పడానికి ,ఆరోగ్యకరమైన అలవాట్లను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వైజాగ్ జూలై 30,2024: పొగాకు వినియోగం వల్ల కలిగే విషపూరిత ప్రభావాలను గురించి నొక్కిచెప్పడానికి ,ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి ‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ అనే పేరుతో ఒక ఆసక్తికరమైన ఇంటరాక్టివ్ హెల్త్ క్యాంపెయిన్‌ను విజయవాడలోని హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్ నిర్వహించింది.

డాక్టర్ సత్య శ్రీనివాస్ ఎ, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ,సెంటర్ సిబ్బంది, తమ మద్దతు అందించడానికి హెచ్‌సిజి వినూత్న కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు.

టీ స్టాల్స్‌లో టీ ,సిగరెట్‌లు తాగడానికి గుమిగూడే వినియోగదారులకు- సిగరెట్ లేకుండా టీని ఆస్వాదించండి – అనే సందేశాన్ని సమర్థవంతంగా తెలియజేయడానికి ‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ అనే ఆకర్షణీయమైన నినాదంతో టీకప్పులను హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ పంపిణీ చేసింది.

ఈ ప్రచారానికి అపూర్వమైన రీతిలో సానుకూల స్పందన లభించింది, చాలా మంది హెచ్‌సిజి కార్యక్రమంతో ప్రేరణ పొందిన తర్వాత పొగాకు రహిత జీవితాన్ని గడపడానికి ప్రతిజ్ఞ చేశారు.

హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, రీజినల్ బిజినెస్ హెడ్ ఏపీ & ఈస్ట్ శ్రీ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలనే మా నిబద్ధతలో భాగంగా, హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ , ‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ ప్రచారాన్ని ప్రారంభించింది.

స్థానిక టీ స్టాల్స్‌లో ఆకర్షణీయమైన నినాదంతో కూడిన టీ కప్‌లను పంపిణీ చేయడం ద్వారా, పొగాకు హానికరమైన ప్రభావాలను మన కమ్యూనిటీకి గుర్తుచేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అదే సమయంలో సిగరెట్ లేకుండా టీని ఆస్వాదించమని వారిని ప్రోత్సహించాము.

ఈ కార్యక్రమానికి లభించిన అపూర్వమైన సానుకూల ప్రతిస్పందన, చిన్నవే అయినప్పటికీ ఆలోచనాత్మక చర్యలు ప్రజారోగ్యం ,శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవని మాకు తెలిపింది. పొగాకు ప్రభావం పై చర్చను ప్రేరేపించినందుకు మేము గర్విస్తున్నాము.

తమ అలవాట్లను పునరాలోచించుకోవడానికి చాలా మందిని ప్రేరేపించాము, తద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడుతున్నాము” అని అన్నారు.

‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ కార్యక్రమం విజయవంతం కావటం గురించి విజయవాడలోని హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్ సిఒఒ శ్రీ యువ కిషోర్ తెర్లి మాట్లాడుతూ ” మా ప్రచారానికి విజయవాడ ప్రజల నుంచి వచ్చిన అత్యుత్తమ స్పందన నిజంగా అభినందనీయంగా ఉంది. తమ సొంత ఆరోగ్యాన్ని నిర్వహించుకునే దిశగా సమాజం ఎలా చురుకైన చర్యలు తీసుకుంటుందో చూడటం స్ఫూర్తిదాయకం.

విజయవాడలోని హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్‌ వద్ద , అవగాహన పెంచడంలో, నివారణకు ప్రాధాన్యత ఇవ్వడంలో చేస్తున్న మా ప్రయత్నాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని పెంపొందించడంలో మా పాత్ర గురించి మేము గర్విస్తున్నాము.” అని అన్నారు.

విజయవాడలోని హెచ్‌సిజి సిటీ క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సత్య శ్రీనివాస్ ఎ మాట్లాడుతూ.. ” పట్టణ జనాభాలో ముఖ్యంగా యువతలో ధూమపానం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ ప్రచారం విజయవాడలోని ప్రజలకు ధూమపానం మానేయడం ,ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం గురించి తెలియజేయడంలో ప్రభావవంతంగా పనిచేసింది.

ఏ రూపంలోనైనా పొగాకు వినియోగాన్ని మానేయడం ,ఊపిరితిత్తుల పరీక్షలు చేయించుకోవడం వంటి ముందస్తు నివారణ చర్యలు క్యాన్సర్‌ను ముందుగానే నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి ..” అని అన్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రేరేపించడం హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది. విజయవాడ లో ‘హావ్ మోర్ టీ, నో మోర్ పఫ్స్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా పొగాకు హానికరమైన ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత విజయవాడ వాసులు ఆరోగ్యకరమైన అలవాట్లను స్వీకరించడానికి ప్రతిజ్ఞ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *