పల్లె పండగ 2.0: రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేలా ప్రణాళికలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 14,2025: పల్లె పండగ విజయాన్ని కొనసాగించే స్ఫూర్తితో పల్లె పండగ 2.0 ప్రణాళికలు రూపొందాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 14,2025: పల్లె పండగ విజయాన్ని కొనసాగించే స్ఫూర్తితో పల్లె పండగ 2.0 ప్రణాళికలు రూపొందాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రూపాన్ని పూర్తిగా మార్చేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభమయ్యే పల్లె పండగ 2.0పై పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రహదారుల అభివృద్ధి, కొత్త రహదారుల నిర్మాణం, మరమ్మత్తులు, గోశాలల స్థాపన, మ్యాజిక్ డ్రైయిన్ల నిర్మాణం వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ్, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, రాష్ట్ర గ్రామీణ మొత్తాన్ని మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం, అభివృద్ధి సాధించడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.