లీడ్ గ్రూప్ ‘యంగ్ లీడర్స్ ప్రోగ్రాం’తో విద్యార్థుల నుంచి విద్యా రంగ సమస్యలకు వినూత్న పరిష్కారాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 6, 2025: భారతదేశంలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ లీడ్ గ్రూప్ నిర్వహించిన యంగ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 6, 2025: భారతదేశంలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ లీడ్ గ్రూప్ నిర్వహించిన యంగ్ లీడర్స్ ప్రోగ్రాం (YLP) విజయవంతంగా ముగిసింది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 14 రాష్ట్రాల నుంచి ఎంపికైన 53 మంది 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోని అసలైన విద్యా సమస్యలను గుర్తించి వాటికి నూతన దృక్పథంతో పరిష్కారాలను రూపొందించారు.

వాస్తవ సమస్యలపై విద్యార్థుల దృష్టి
వీరు పరిశ్రమ నిపుణుల మార్గదర్శనంలో పది కీలక ప్రాజెక్టులపై పనిచేశారు. వీటిలో వృత్తి విద్యాభ్యాసం, భావోద్వేగ సంక్షేమం, ఇంట్లో అభ్యాసం లో ఆసక్తి పెంపు, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రాముఖ్యతనిచ్చారు. అలాగే, BALA (Building as Learning Aid) సిద్ధాంతంతో పాఠశాలలను చక్కటి లెర్నింగ్ స్పేస్‌లుగా మలచడం, పఠన అలవాట్లను పెంపొందించడం, గ్రీన్ స్కూల్స్ కార్యక్రమాలు, విద్యా రంగానికి సంబంధించిన సోషల్ మీడియా వ్యూహాల రూపకల్పన వంటి ప్రాజెక్టులు కూడా చేపట్టారు.

Read This also…LEAD Group Empowers Students Nationwide with Real-World Problem Solving Through Young Leaders Program

Read This also…ICICI Prudential Life Disburses Over ₹900 Crore in Loans Against Traditional Policies in FY2025..

విజేతల భావోద్వేగ స్పందన
ఈ కార్యక్రమంలో “Whiz Titans” అనే బృందం విజేతగా నిలిచింది. వారు మాట్లాడుతూ, “ఈ ప్రోగ్రాం మా ఆలోచనా విధానాన్ని మార్చింది. మేము జట్టుగా పని చేయడం, లోతైన విశ్లేషణ చేయడం, ప్రయోజనకరమైన పరిష్కారాలు ప్రతిపాదించడం నేర్చుకున్నాం. ఇది మాకు భవిష్యత్ నాయకులుగా మారే బాటలో మొదటి అడుగు.”

మౌలిక దృక్పథంతో ముందుకు సాగుతున్న లీడ్
లీడ్ గ్రూప్ CEO సుమీత్ మెహతా మాట్లాడుతూ, “దేశంలోని చిన్న పట్టణాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రోగ్రాం మంచి వేదిక. ప్రాక్టికల్ సమస్యల పరిష్కారాల ద్వారా వారు రేపటి మార్గదర్శకులుగా ఎదుగుతారు.” అని తెలిపారు.


కో-సీఈఓ స్మితా దేవ్రా మాట్లాడుతూ, “పిల్లలు నిజమైన సవాళ్ల నుంచి నేర్చుకునేలా వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రతిభను గుర్తించి, సరైన మార్గనిర్దేశనతో, వారికి ఎదగడానికి వేదిక కల్పించడమే ఈ ప్రోగ్రాం సారాంశం.”

Read This also…Guru Nanak University Partners with Intellipaat to Launch Industry-Driven B.Tech Programs in Hyderabad

Read This also…Chaurya Paatham: Crime Meets Comedy in a Rural Heist Gone Wrong..

ఎంపిక ప్రక్రియ
వైఎల్‌పీకి దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు తమ అత్యుత్తమ పది విద్యార్థులను నామినేట్ చేశాయి. తర్వాత విద్యార్థులు అర్హత పరీక్షలు, వీడియో ప్రెజెంటేషన్‌లు పూర్తి చేసి, జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రాం ఒక పటిష్ఠమైన కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా… వాస్తవ పరిస్థితుల అవగాహన, ఆలోచన ఆవిష్కరణ, సమీక్ష, మరియు కార్యాచరణ ప్రతిపాదన తయారీ ప్రక్రియలపై దృష్టి సారించింది.

ఈ విధంగా, లీడ్ వారి వైఎల్‌పీ విద్యార్థులకు ఏకకాలంలో జ్ఞానం, నైపుణ్యం, సేవా దృక్పథం పెంపొందించే అనుభవాన్ని అందించింది.

About Author