సోనీ లివ్‌లో మే 30 నుంచి ‘కన్‌ఖజురా’… హృదయాన్ని తొలిచే థ్రిల్లర్‌ టీజర్‌ విడుదల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, మే13,2025: సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మేళవించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘కన్‌ఖజురా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రముఖ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, మే13,2025: సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మేళవించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘కన్‌ఖజురా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్‌లో మే 30 నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్‌… గోవా నిశ్శబ్ద చాయల్లో నడిచే ఓ మానసిక పోరాట గాథ. ఎక్కడో నిశ్శబ్దంగా కనిపించే ఓ మారుమూల ప్రాంతం… అసలు ముప్పు అంతు కనిపించకుండా దాగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పే కథ ఇది.

ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా ‘కన్‌ఖజురా’ను హిందీలో అత్యంత భావోద్వేగభరితంగా రూపుదిద్దారు. అయితే భారతీయ భావోద్వేగాలకి తగినట్టుగా దీన్ని పూర్తిగా పునర్నిర్మించారు. కథలో ఇద్దరు వేరుపడిన అన్నదమ్ములు గతపు భయానక క్షణాల్ని ఎదుర్కొంటారు. జ్ఞాపకాలు వాస్తవాలుగా మారే సమయానికి వారు ఊహించని వాస్తవాలను తేల్చుకోవాల్సి వస్తుంది.

ఈ సిరీస్‌లో అషు పాత్ర పోషించిన నటుడు రోషన్ మాథ్యూ మాట్లాడుతూ… ‘‘ఈ కథలో భావోద్వేగాల తీవ్రత ఎంతగా ఉన్నాయంటే అది నన్ను ఆకర్షించకుండా ఉండలేదు. ‘కన్‌ఖజురా’లో నా పాత్ర లోపల ఓ నిశ్శబ్ద తుపాను లాంటి వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి సంబంధం లో లోపాలుంటాయి. ఆ లోపాల్ని ఎలా ఎదుర్కొంటారనేది ఈ కథలో కీలకం’’ అన్నారు.

చందన్ అరోరా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అజయ్ రాయ్ నిర్మించారు. మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా, ఉషా నద్కర్ణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సిరీస్ సృష్టికర్తలైన ఆడమ్ బిజాన్స్కీ, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్‌లు డోనా & షులా ప్రొడక్షన్స్‌తో కలిసి, యెస్ స్టూడియోస్ లైసెన్స్‌పై దీనిని నిర్మించారు.

‘కన్‌ఖజురా’ మే 30 నుంచి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

About Author