ఫ్యాషన్, టెక్నాలజీ & వినోదం కలయికతో వైజాగ్‌లో అద్భుతంగా ముగిసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 11,2025: ఫ్యాషన్, టెక్నాలజీ, వినోదం సమ్మేళనంగా వైజాగ్‌లో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ అద్భుతంగా నిర్వహించనుంది. ఈ మెరుపు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 11,2025: ఫ్యాషన్, టెక్నాలజీ, వినోదం సమ్మేళనంగా వైజాగ్‌లో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ అద్భుతంగా నిర్వహించనుంది. ఈ మెరుపు సాయంత్రంలో షోస్టాపర్‌గా తమన్నా భాటియా రన్‌వే పై కదలాడగా, అక్షత్ బన్సల్ బ్రాండ్ ‘బ్లోనీ’ ప్రేక్షకులను అలరించింది.

ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనాన్ని అందించిన ఈ ప్రదర్శనలో, ప్రముఖ గాయకుడు రిత్విజ్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శనతో వేదికను కదిపేశారు.

Read this also…Muthoot Finance Unveils ‘Double Milligram Gold Rewards’ for Women Customers

Read this also…Experience the Best of K-Dramas on Tata Play K-Dramas..

ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ టూర్, ఫ్యాషన్ ప్రపంచంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అక్షత్ బన్సల్ కలెక్షన్ – ఏఐ జనరేటెడ్ విజువల్స్, 3D మోడల్డ్ ఎలిమెంట్స్, ఆధునిక టెక్సటైల్ డిజైన్లతో రన్‌వేను కొత్తదనంతో నింపింది.

తమన్నా భాటియా ప్రత్యేకమైన డిజైన్‌ను ధరించి ర్యాంప్‌పై నడవగా, చెఫ్ మొహమ్మద్ ఆషిక్ రూపొందించిన ప్రత్యేకమైన వంటకాలు ఈ వేడుకకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

పెర్నాడ్ రికార్డ్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, గ్లోబల్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ కార్తీక్ మోహింద్ర మాట్లాడుతూ, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఎల్లప్పుడూ సృజనాత్మకతకు కొత్త హద్దులు నిర్ధారిస్తూ, ఫ్యాషన్‌ను కళారూపంగా పునర్నిర్వచించడమే లక్ష్యంగా కొనసాగుతోంది” అని తెలిపారు.

బ్లోనీ వ్యవస్థాపకుడు, డిజైనర్ అక్షత్ బన్సల్ మాట్లాడుతూ, “ఫ్యాషన్ కేవలం దుస్తుల గురించి మాత్రమే కాదు; ఇది ఆవిష్కరణ, టెక్నాలజీ, వ్యక్తిత్వ వ్యక్తీకరణల కలయిక” అని చెప్పారు.

షోస్టాపర్ తమన్నా భాటియా మాట్లాడుతూ, “బ్లోనీ కోసం ర్యాంప్‌పై నడవడం ఓ గొప్ప అనుభవం. అక్షత్ బన్సల్ కలెక్షన్ వినూత్నమైన డిజైన్స్, టెక్నాలజీ సమ్మేళనంతో ప్రత్యేకతను సంతరించుకుంది” అని అన్నారు.

Read this also…Jawa Yezdi and BSA Launch Segment-Leading Ownership Assurance Program

ప్రసిద్ధ సంగీతకారుడు రిత్విజ్ మాట్లాడుతూ, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌లో భాగస్వామ్యం కావడం గొప్ప అనుభవం. స్టైల్, ఆవిష్కరణ, సంగీతం అంతా కలిసి ఓ అద్భుతమైన మేజిక్ సృష్టించాయి” అని అన్నారు.

క్యూరేటర్ ఆశిష్ సోని మాట్లాడుతూ, “The One & Only అనుభవాలను కొత్త దిశలో తీసుకెళ్తున్న తీరు చూడటం ఉత్సాహంగా ఉంది” అని పేర్కొన్నారు.

FDCI చైర్మన్ సునీల్ సేథి మాట్లాడుతూ, “ఫ్యాషన్ అనుభవాల భవిష్యత్తును మేము రూపొందిస్తున్నాము” అని అన్నారు.

ఈ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ తర్వాతి విడత మార్చి 23, 2025న గౌహతి నగరంలో జరగనుంది.

About Author