సీఎం చంద్రబాబుపై జగన్ మండిపాటు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: వైసీపీ హయాంలో మద్యం స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: వైసీపీ హయాంలో మద్యం స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తారని భావించినా, గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

సమావేశం ప్రారంభమైన వెంటనే జగన్ ప్రసంగంలో తడబాటు కనిపించింది. ఎప్పటిలాగే, వైసీపీ పాలనలో అమలు చేసిన పథకాలు, రివర్స్ టెండర్ల విధానం వంటి అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు పాలనపై విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జగన్, ఇసుక, బెల్టు షాపులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సూపర్ 6 లేదు.. సూపర్ 7 లేదంటూ” ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరితంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. “చీటింగ్‌లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ” కటాక్షించారు. ఆయన నాయనా నటనలోనైనా అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు.

ఆర్థిక విపత్తుపై జగన్ వ్యాఖ్యలు

  • రూ.1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయి?
  • ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా 2 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించారు.
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు.
  • వాలంటీర్లను మోసం చేసినట్లే ఉద్యోగులను కూడా మోసం చేస్తున్నారు.
  • ప్రభుత్వంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు.
  • ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పి, ఉన్న పీఆర్సీ ఛైర్మన్‌ను పంపించేశారు.
  • ఏ నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు ఇచ్చారో చెప్పాలి.
  • ఇప్పుడెవడు చేస్తున్నది ఆర్థిక విధ్వంసం.

ప్రభుత్వ ప్రాజెక్టులపై ప్రస్తావన

జగన్ తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, “మా హయాంలో నాలుగు పోర్టులు కట్టాం, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు నిజాలను చెప్పాలని జగన్ వ్యాఖ్యానించారు. “చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో నోరు పెట్టడమే!” అంటూ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

About Author