ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్సులు అందించిన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 3,2025: ప్రజారోగ్య సంరక్షణను ప్రోత్సహించేందుకు ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ నాలుగు అంబులెన్సులను ఆంధ్రప్రదేశ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 3,2025: ప్రజారోగ్య సంరక్షణను ప్రోత్సహించేందుకు ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ నాలుగు అంబులెన్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు సోనూ సూద్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించేందుకు, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులను అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు అధునాతన వైద్య సేవలు అందేలా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సోనూ సూద్, తాము అందించిన అంబులెన్సులు ఆపదలో ఉన్నవారికి జీవితాన్నిప్రతిసారీ భరోసా కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author