వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 3,2025: శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 3,2025: శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజ నిర్వహించబడుతుండగా, భవిష్యత్తు తరాలకు ఈ సేవలను సుస్థిరంగా అందించేందుకు, అరుగుదలను అరికట్టి, ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే సలహా జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల నుండి తీసుకున్న టీటీడీ బోర్డు, వసంతోత్సవం, సహస్ర కలశాభిషేకం, విశేషపూజలను ఏడాదికి ఒక్కసారి నిర్వహించాలని నిర్ణయించింది.

ఇంకా, ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను టీటీడీ ప్రత్యేకంగా నిర్వహించనుంది.

ఈ మేరకు తొలిసారిగా, ఈ వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మొదటగా, అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై చతుర్దశ కలశావాహనం, పుణ్యహవచనం, వివిధ క్రతువులు నిర్వహించి, పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author