తెలుగులో ‘పా..పా..’గా రానున్నతమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 30,2024: తెలుగు ప్రేక్షకుల కోసం ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సిద్ధమవుతోంది. తమిళంలో సంచలనం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 30,2024: తెలుగు ప్రేక్షకుల కోసం ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సిద్ధమవుతోంది. తమిళంలో సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ ‘డా..డా’ చిత్రం తెలుగులో ‘పా..పా..’ పేరుతో విడుదల చేయనుంది.
ఈ చిత్రాన్ని జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట నిర్మించారు. డిసెంబర్ 13న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

గత ఏడాది తమిళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹30 కోట్ల వసూళ్లను సాధించిన ‘డా..డా’ చిత్రం, కోలీవుడ్‌లో పెద్ద హిట్ అయ్యింది. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో రూపొందింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందించింది.
తండ్రి-కొడుకు సెంటిమెంట్‌ను బాగా పండించి, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘డా..డా’ చిత్రం, ఇప్పుడు తెలుగులో ‘పా..పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకోవాలని నిర్మాత నీరజ కోట విశ్వసిస్తున్నారు.
ఈ చిత్రంలో కామెడీ, భావోద్వేగం, ప్రేమ అన్నీ సరిగ్గా మిళితమై ఉండటం వలన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆమె తెలిపారు.

ఈ చిత్రం తెలుగులో ఎంజీఎం సంస్థ ద్వారా, అచ్చిబాబు విడుదల చేయబోతున్నారు.
ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: నీరజ కోట
హీరో: కవిన్
హీరోయిన్: అపర్ణా దాస్
నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
మ్యూజిక్: జెన్ మార్టిన్
సాహిత్యం: రవివర్మ ఆకుల
పీఆర్వో: కడలీ రాంబాబు, అశోక్ దయ్యాల