సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన స్టార్ అగ్రివేర్‌హౌసింగ్ అండ్ కొలేటరల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2024: టెక్నాలజీ ఆధారిత సమగ్ర వ్యవసాయ విలువ శ్రేణి సేవల సంస్థ అయిన స్టార్ అగ్రివేర్‌హౌసింగ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2024: టెక్నాలజీ ఆధారిత సమగ్ర వ్యవసాయ విలువ శ్రేణి సేవల సంస్థ అయిన స్టార్ అగ్రివేర్‌హౌసింగ్ అండ్ కొలేటరల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది.
ఈ సంస్థ కొనుగోళ్లు, వ్యాపార సౌకర్యం, గిడ్డంగులు నిర్వహణ, కొలేటరల్ మేనేజ్‌మెంట్, ఆర్థిక పరిష్కారాలు, డిజిటల్ మార్కెట్‌ప్లేస్, టెక్నాలజీ ఆధారిత డేటా సేవలను అందిస్తోంది.
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)
కంపెనీ ఐపీవో ద్వారా రూ.450 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయడం, అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2,69,19,270 షేర్లను విక్రయించేందుకు ప్రణాళికను రూపొందించింది.
కంపెనీ సేకరించిన నిధులను కింది అవసరాల కోసం వినియోగించనుంది:
కంపెనీ నిర్వహణ మూలధన అవసరాలకు రూ.120 కోట్లు
మెటీరియల్ సబ్సిడరీ ఎఫ్ఎఫ్ఐపీఎల్ కోసం రూ.125 కోట్లు
ఏఎఫ్ఎల్ మూలధన అవసరాలకు రూ.100 కోట్లు
మిగిలిన మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఆఫర్ ఫర్ సేల్లో పలు ప్రమోటర్లు ,ప్రమోటర్ గ్రూప్ సభ్యులు తమ వాటాలను విక్రయించనున్నారు.
ప్రమోటర్ షేర్‌హోల్డర్లు:
అమిత్ అగర్వాల్: 13,18,126 షేర్లు
అమిత్ గోయల్: 43,93,754 షేర్లు
అమిత్ ఖండేల్వాల్: 15,005 షేర్లు
సురేష్ చంద్ర గోయల్: 15,00,000 షేర్లు
క్లేమోర్ ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) లిమిటెడ్: 1,19,80,508 షేర్లు
జేఎం ఫైనాన్షియల్, యాంబిట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈక్విరస్ క్యాపిటల్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.
ఎఫ్ & ఎస్ నివేదిక ప్రకారం, సంస్థ 2022-2024 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక ఆదాయంతో అత్యంత లాభదాయకమైన సంస్థగా గుర్తింపు పొందింది.
2024 జూన్ 30 నాటికి రూ.130-165 బిలియన్ల మధ్య అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం), 4.5-5.2 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ గిడ్డంగి సామర్థ్యంతో అత్యంత పెద్ద స్థాయిలో సేవలందిస్తోంది.
స్టార్ అగ్రివేర్‌హౌసింగ్, భారత వ్యవసాయ రంగానికి అత్యుత్తమ సేవలను అందించే సంస్థగా కొనసాగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.