భావి తరాలకు స్ఫూర్తి “పింగళి వెంకయ్య”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 21,2024: మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరును

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 21,2024: మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరును నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ ప్రజలకు స్ఫూర్తిని అందించే విధంగా పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండాను జాతికి అందించారు. ఆయన చరిత్రలో స్ఫూర్తిదాయకమైన పాత్రను నిలబెట్టేందుకు, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టడం ఎంతో గర్వకారణం.

ఈ నిర్ణయంతో పింగళి వెంకయ్య స్ఫూర్తి భావి తరాలకు ఎప్పటికీ అందించనుంది. ఆయన దేశ సేవకు చేసిన త్యాగాలను, మార్గదర్శకత్వాన్ని స్మరించుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. ఈ మహనీయుడి పేరు నిర్ణయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.