గిరిజన గ్రామాలకు కొత్త రహదారుల శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 21,2024: పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం మొదలయ్యింది. ఎన్నికల ముందు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 21,2024: పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం మొదలయ్యింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, గిరిజన గ్రామాల్లో ఉన్న డోలీ మోత కష్టాలు తీరుస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తో కలిసి శుక్రవారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సాలూరు నియోజకవర్గం, మకువ మండలం, పనసభద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బాగుజోల – సిరివర మధ్య మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 9.50 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో సిరివర, చిన్న మండంగి, చిలక మండంగి, ఇతర గిరిజన గ్రామాల వాసులు డోలీ మోత కష్టాల నుంచి విముక్తి పొందనున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని మరో 19 గిరిజన గ్రామాల్లో 16 పనుల బీటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ రోడ్ల నిర్మాణం ₹20.11 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు.

వీటితో పాటు మొత్తం ₹36.71 కోట్ల అంచనా వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర 19 నూతన రోడ్లు నిర్మించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణం ద్వారా 55 గిరిజన గ్రామాలలో 3,782 మంది గిరిజనులు డోలీ మోత కష్టాల నుంచి విముక్తి పొందనున్నారు.

గిరిజన గ్రామాల్లో స్థితిగతులపై ఎగ్జిబిషన్

ఈ కార్యక్రమానికి ముందు బాగుజోల వద్ద గిరిజన గ్రామాల్లో స్థితిగతులు, ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఫోటోల్లోని అంశాలకు సంబంధించి అధికారులు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ , శ్రీమతి జగదీశ్వరి , శ్రీమతి లోకం మాధవి , పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ , పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About Author