జోరు వానలో సాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 21,2024: ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్య మంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 21,2024: ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్య మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. జోరు వానలలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగింది.

ఉప ముఖ్యమంత్రి గిరిజన గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి, అధికారులకు అనేక ఆదేశాలు ఇచ్చారు. మక్కవు మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు.

చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. కొండలు, జలపాతాలను మొబైల్‌లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఇక్కడ అడ్వెంచర్ టూరిజాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు.

దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకె అందించమని ఆదేశించారు.

శంబర గ్రామంలో పోలమాంబ ఆలయం వద్ద, పనికిరాని ఆహార పథకం నిధులతో నిర్మించిన కొత్త సిమెంట్ రోడ్డు యొక్క స్థితిగతులను పరిశీలించారు. రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకొని, కొత్త రోడ్డును తన మొబైల్‌లో వీడియో తీసుకున్నారు.

About Author