శ్యామ్ బెనెగల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 23,2024: వాస్తవానికి అద్దం పట్టిన కథలతో భారతీయ సినీ ప్రపంచానికి విలక్షణమైన దిశ చూపించిన దిగ్గజ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 23,2024: వాస్తవానికి అద్దం పట్టిన కథలతో భారతీయ సినీ ప్రపంచానికి విలక్షణమైన దిశ చూపించిన దిగ్గజ దర్శకులు శ్యామ్ బెనెగల్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన వార్త వినడం అత్యంత విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను.

శ్యామ్ బెనెగల్ తెరపై ఆవిష్కరించిన కథలు, పాత్రలు సమాజంలో ఉన్న సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి. 1976లో అమూల్ పాల రైతుల సహకారంతో రూ.2 చొప్పున సేకరించిన నిధులతో మంథన్ అనే అత్యుత్తమ చిత్రాన్ని నిర్మించారని తెలుసుకున్నప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యమేసింది.

అంకుర్, నిశాంత్, భూమిక, మండి, మంథన్ వంటి చిత్రాలతో ఆయన భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేశారు. వారి చిత్రాల శైలిని మరెవ్వరూ అనుకరించలేని విధంగా వారు ప్రతిభను చాటుకున్నారు.

శ్యామ్ బెనెగల్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి స్మృతులు ఎల్లకాలం మనతో ఉండి ప్రేరణనివ్వగలవు.

About Author