తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు: అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 2,2024: తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3 నుండి 12వ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 2,2024: తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా, ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుక నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక ఉత్సవంలో, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే, రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ కూడా నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా, అక్టోబరు 12వ తేదీ రాత్రి 7:45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు..

నవరాత్రి ఉత్సవాల కారణంగా, ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం సేవ రద్దు చేయబడింది. అదేవిధంగా, అక్టోబరు 4 , 11వ తేదీలలో జరిగే లక్ష్మీ పూజ, అక్టోబరు 12న జరిగే ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.

About Author