ఏపీ డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ను కలిసిన అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 23,2024 : అసెంబ్లీలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది తాము ఎనిమిది సంవత్సరాల క్రితం రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 23,2024 : అసెంబ్లీలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది తాము ఎనిమిది సంవత్సరాల క్రితం రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచిన ఇంకా రూ.10 వేలలోపే జీతం ఉందని, గతంలో అమరావతి రైతు కూలీలుగా ఉన్నందుకు 2500 కూలీ భత్యం వచ్చేదని ఇప్పుడు అది కూడా గత ప్రభుత్వ నిలిపింది. కాబట్టి తమను ఆదుకునేందుకు ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విన్నవించారు.

వారి సమస్యలు పట్ల సానుకూలంగా స్పందించిన ఆయన దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, వారందరితో సరదాగా మాట్లాడి, వారితో ఫోటో దిగారు.