కీరవాణికి హృదయపూర్వక ధన్యవాదాలు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్30, 2024:’ఓం నమో నారాయణాయ’మంత్రాన్ని ప్రజలు సులభంగా పఠించేందుకు అనువుగా రూపొందించిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్30, 2024:’ఓం నమో నారాయణాయ’మంత్రాన్ని ప్రజలు సులభంగా పఠించేందుకు అనువుగా రూపొందించిన ఆడియో రికార్డింగ్ కోసం ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి భక్తుడిని తీవ్రంగా కదిలించింది.

ఆ క్షోభనే నాకు ఈ ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించడానికి కారణమైంది.

ఈ దీక్షకు సంఘీభావంగా, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారు దేశంలోని వివిధ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు నిర్వహిస్తున్నారు. వీరందరూ ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని పఠిస్తున్నారు.

దీనికి సహకరించేందుకు కీరవాణి భక్తి భావంతో ఆడియో రికార్డు చేశారు, ఇది అందరినీ ఆధ్యాత్మికంగా ఉద్దేశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ధర్మో రక్షతి రక్షితః

About Author