స్వచ్ఛత… శుభ్రత ప్రజల జీవన విధానంగా మారాలి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 18,2025: స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 18,2025: స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య కార్మికులకో, క్లాప్ మిత్రలకో మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం అనేది మన అందరి బాధ్యత” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరూ గ్రామంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.

పంచాయతీల పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డులు, చెత్త వేరు చేసే పద్ధతులు వంటి విషయాలను స్వయంగా పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించి, పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. స్వచ్ఛతకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెత్త ట్రాక్టరును నడిపి, స్వచ్ఛతలో తాను కూడా భాగస్వామి అయ్యారని సందేశం ఇచ్చారు.

2047 వికసిత్ భారత్ లో స్వచ్ఛత అనేది ప్రధానం అని ఆయన చెప్పారు. ‘‘కరోనా సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు, స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పుడు అందరిలో కూడా క్రమశిక్షణ రావాలి. స్వచ్ఛత మన జీవితం భాగం కావాలి. భవిష్యత్తులో, చెత్త కనిపించని భారతదేశాన్ని సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలి’’ అన్నారు.

చెత్త నుంచి సంపద సృష్టి: చెత్తను వేరు చేయడం ద్వారా దానిని పునర్వినియోగం చేయడం ద్వారా సంపదను సృష్టించవచ్చు. చెత్త వేరు చేయడం, దానిని ఉపయోగించే విధానం ప్రతి ఇంటిలో అమలు కావాలి.

అలాగే, చెత్త ద్వారా విద్యుత్ ప్లాంట్లు నిర్వహించేందుకు, వర్మీ కంపోస్టును తయారు చేయడానికి స్థానిక సంస్థలు ప్రణాళికలు రూపొందించాలి. ఈ విధానం చెత్త ఉత్పత్తి తగ్గించడానికి, ప్రజల చైతన్యాన్ని పెంపొందించడానికి ముఖ్యమై ఉంది.

బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి: ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికతో, స్వచ్ఛంద సంస్థల సహాయంతో వీటిని నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘‘ఇవి కాలుష్యం పెంచి, మన ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి’’ అని చెప్పారు.

పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అమూల్యమైనవి అని పేర్కొంటూ, వారిని గౌరవించుకోవడం ప్రజలందరి బాధ్యతగా గుర్తించుకోవాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

About Author