పల్లకీ సేవలో ఆకట్టుకున్న చండ మేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 2,2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పల్లకీ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 2,2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పల్లకీ సేవలో చండ మేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాలు 250 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
చండ మేళం
కర్ణాటక ఉడిపి ప్రాంతంలోని పాలిమర్ మఠంకు చెందిన బెల్ కలై చండీ మేళం బృందం, 5 సంవత్సరాలుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చండ మేళం (కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు.
ఈ బృందంలో మొత్తం 8 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ, ఆ వాయిద్యాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు.
లెస్యూమ్స్ నృత్యం
కర్ణాటక మైసూరు నుండి 33 మంది యువతులు, తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మోహిని అవతారం నృత్యరూపకం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటాల ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు.
కొమ్ము – కోయ, గోండు డ్యాన్స్
తెలంగాణ హైదరాబాదు నుంచి 25 మంది యువతుల బృందం, కొమ్ము – కోయ, గోండు డ్యాన్స్‌లతో నయనానందకరమైన ప్రదర్శన ఇచ్చింది.
ఒడిసి నృత్యం
కర్ణాటక నుంచి 17 మంది యువతులు ఒడిసి నృత్యం ప్రదర్శించారు, రాజమండ్రి నుంచి 30 మంది యువతుల సాంప్రదాయ జానపద నృత్యం భక్తులను ఉత్సాహంగా చూస్తూ ఆనందించించారు.
కీలుగుర్రాలు
పలమనేరుకు చెందిన 15 మంది కళాకారుల కీలుగుర్రాలు, అనంతపురం శ్రీకృష్ణ నాట్య మండలికి చెందిన 30 మంది యువతుల గోపి కృష్ణ నృత్యాలు భక్తులను పరవశింప చేశారు.