ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల పీజీ ఇన్ సర్వీస్ కోటా విషయంలో అసోసియేషన్ విజ్ఞాపన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, సెప్టెంబర్ 26, 2024: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, సెప్టెంబర్ 26, 2024: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జీవో 85 ప్రకారం, పీజీ ఇన్ సర్వీస్ కోటాలో తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తున్నారని విజ్ఞాపన పత్రం అందజేశారు.
బుధవారం సాయంత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద సమావేశమైన అసోసియేషన్ ప్రతినిధులు, గతంలో మూడు సంవత్సరాల సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు ఆ వ్యవహారాన్ని అయిదు సంవత్సరాలకు పెంచడమే కాకుండా, ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారంటూ వివరించారు.

ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి,ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి అందించాల్సిన విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంగీకరించారు. వైద్యులు తమ హక్కులను రక్షించేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.