మహీంద్రా ఆలిండియా టాలెంట్ స్కాలర్‌షిప్స్ 2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 13,2024:వివిధ రకాల ఉపకారవేతనాల ను అందించడం ద్వారా 71 ఏళ్ల నుంచి వేలకొద్దీ విద్యార్థులకు కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 13,2024:వివిధ రకాల ఉపకారవేతనాల ను అందించడం ద్వారా 71 ఏళ్ల నుంచి వేలకొద్దీ విద్యార్థులకు కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్టు (KCMET) తోడ్పాటు అందిస్తోంది. తాజాగా భారత్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లలో ఉద్యోగ ఆధారిత డిప్లమా కోర్సులు అభ్యసించదల్చుకున్న అల్పాదాయ కుటుంబాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారికి సహకారం అందించేందుకు కేసీఎంఈటీ తమ వార్షిక మహీంద్రా ఆలిండియా టాలెంట్ స్కాలర్‌షిప్ (MAITS) 2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని కింద ఏటా రూ. 10,000 చొప్పున 550 మంది విద్యార్థులకు గరిష్టంగా 3 సంవత్సరాల పాటు ఉపకారవేతనం ఇవ్వబడుతుంది.

ఎస్ఎస్‌సీ/హెచ్‌ఎస్‌సీ లేదా తత్సమాన 10వ/12వ తరగతిలో 60 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సదరు అభ్యర్థి ప్రభుత్వ లేదా ఇతరత్రా గుర్తింపు పొందిన పాలికటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లో డిప్లమా కోర్సులో అడ్మిషన్ పొంది ఉండాలి. కోర్సులో తొలి ఏడాది ఎన్‌రోల్ అవుతున్న విద్యార్థులకే స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది.
మహీంద్రా ఆలిండియా టాలెంట్ స్కాలర్‌షిప్ (MAITS)కి సంబంధించి మరిన్ని వివరాల కోసం దయచేసి www.kcmet.org ను విజిట్ చేయండి. అప్లికేషన్ ఫారం,దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల వివరాలను https://maitsscholarship.kcmet.org/ పోర్టల్‌లో పొందవచ్చు. పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు మీ వేలిడ్ ఈమెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతరత్రా సందేహాలకు దయచేసి maits@mahindra.com ని సంప్రదించండి.
తెలంగాణలోని విద్యార్థులు దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 2024 ఆగస్టు 21. షార్ట్‌లిస్ట్ చేయబడిన విద్యార్థులకు ముందస్తుగా ఇంటర్వ్యూ తేదీ, వేదిక గురించి తెలియజేయనుంది.

కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ 1995 నుంచి ఈ ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,390 విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది. స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియలో బాలికలకు, అల్పాదాయ కుటుంబాలకు చెందిన పిల్లలకు, దివ్యాంగులకు, సాయుధ బలగాలు లేదా ఇతర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సులకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
అనేక మంది MAITS గ్రహీతలు పలు సవాళ్లను అధిగమించి, తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను లిఖించుకున్నారు. MAITS గ్రహీతలు నేడు కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.