ఏపీలో కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌ భారీ స్కామ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్‌ బయటపడింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లో కోట్లు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్‌ బయటపడింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లో కోట్లు దోచినట్లుగా నిర్ధారించింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లో పది కోట్ల స్కామ్‌ జరిగినట్టు సమాచారం.

దీనితో పాటు మిగతా బ్రాంచ్‌లలో కూడా ఇదే విధమైన సంఘటనలు చోటుచేసుకున్నాయా? కస్టమర్ల ఒరిజినల్‌ నగలను కూడా అపహరించారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పుంగనూరు, పలమనేరులోని కనక దుర్గ గోల్డ్‌ లోన్స్ సంస్థలో నకిలీ బంగారం గురించి పెను గోల్‌మాల్ బయటపడింది. ఉద్యోగులే తమ బంధువుల ద్వారా నకిలీ బంగారం తీసుకుని, ఎడాపెడా లోన్లు ఇవ్వడం వల్ల మొత్తం 8 కోట్ల స్కామ్‌ జరిగినట్టు ఆడిట్‌లో తేలింది. ఈ ఘటనలో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే, అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లో కూడా అదే విధమైన స్కామ్‌ బయటపడింది. అక్కడ కూడా కంపెనీ మేనేజర్‌, సిబ్బంది కలిసి నకిలీ బంగారం పెడుతూ, 56 లక్షల రూపాయలను అంగీకరించారు. ఆడిట్‌ ద్వారా ఈ అవినీతి బయటపడ్డది.

కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌ సంస్థ చీఫ్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఆడిటర్‌ రామాంజనేయులు,మేనేజర్లు జ్వాలా చంద్రశేఖర్‌ రెడ్డి, గురునాథ్‌ రెడ్డిలపై కేసులు నమోదు చేసారు.

అయితే, ఈ సంఘటనలు బయటపడిన తర్వాత, నకిలీ బంగారాన్ని ఒరిజినల్‌ నగలతో కవర్‌ చేయాలని ప్రయత్నించారు అని తెలుస్తోంది.

ఈ స్కామ్‌ తో పోలిస్తే, పుంగనూరు, పలమనేరులోని కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లో 8 కోట్ల స్కామ్‌ వెలుగుచూసింది, దాంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కంపెనీ హెడ్‌ ఆఫీసు విజయవాడలో ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 60 కేంద్రాల్లో గోల్డ్‌ ఫైనాన్స్‌ సేవలు అందిస్తోంది. మరిన్ని బ్రాంచ్‌లలో కూడా ఇదే విధమైన స్కామ్‌లు జరిగాయా లేదా కస్టమర్ల ఒరిజినల్‌ నగలను కూడా అపహరించారు అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

About Author