“లడ్డూ కల్తీపై సిట్ విచారణకు స్వాగతం”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూస్, సెప్టెంబర్ 23,2024: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూస్, సెప్టెంబర్ 23,2024: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సిట్‌తో తిరుమలలో కల్తీ వ్యవహారం ఎవరి వల్ల, ఎందుకు జరిగిందో తెలియజేసే అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణకు సహకరించనుంది.

అదేవిధంగా, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాను. ట్రస్టుకు సంబంధించిన లెక్కలు నిపుణులచే విచారణ జరపించి, ఎలాంటి ఆర్థిక పొరపాట్లు జరిగాయో తెలుసుకోవాల్సిన సమయం ఇది.
భగవంతుడికి చేసే సేవల విషయంలో మాత్రమే కాకుండా, ఆర్థికపరమైన విషయాలలో కూడా గత పాలకుల ఎటువంటి తప్పిదాలు జరిగాయో ప్రజలకు తెలియజేయడం ముఖ్యమని భావిస్తున్నాను.
“ధర్మో రక్షతి రక్షితః”