“అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడం ఎంతో గర్వకారణం”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూస్, సెప్టెంబర్ 23,2024: మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూస్, సెప్టెంబర్ 23,2024: మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో గర్వకారణం. సినీ ప్రపంచంలో ఎన్నో రికార్డులు, విజయాలను సాధించిన అన్నయ్య కి ఇది మరో అత్యున్నత గౌరవం.

156 సినిమాల్లో నటించి, 537 పాటలకు స్టెప్స్ వేసి, మొత్తం 24 వేల స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అన్నయ్య పేరు ‘ఇండియన్ సినిమాలో అత్యధికంగా పని చేసిన నటుడు’ గా గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదు కావడం ప్రత్యేక ఘనత.

‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’గా గౌరవించడం సినీ ప్రేమికులకు సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రత్యేక సందర్భంలో అన్నయ్య కి నా హృదయపూర్వక అభినందనలు.

About Author