స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాము
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 4, 2024:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 4, 2024:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు… అన్నిటా నాణ్యత ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్ళు చేసిన నిర్ణయాలు, వారి పాలన తీరును – సమగ్రంగా సమీక్షించి, సంస్కరించే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తాము.
#TirumalaLadduScandal,
#SupremeCourtOrder,
#AdulteratedGhee,
#SITInvestigation,
#CBIProbe,
#FSSAI,
#TTDCorruption,
#ChandrababuNaidu,
#TemplePrasadam,
#TTDReforms,
#SanatanaDharma,
#TirumalaTemple,
#LadduPreparation,
#ReligiousSentiments,
#AndhraPradeshGovernment,