గత పాలకుల నిర్లక్ష్యానికి మూలంగా నీటి సమస్యలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20,2024: ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20,2024: ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ కాలంలో గ్రామాలకు రూ.4 లక్షల నిధులు కేటాయించినా, రక్షిత తాగునీటి సరఫరా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల ఫలితంగా రంగు మారిన నీరు పంపుల ద్వారా సరఫరా అవుతూ, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి అన్నారు. ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, తమ నియోజకవర్గంలో రంగు మారిన నీటి సమస్యను ఉపముఖ్యమంత్రికి తెలియజేశారు.

ఈ సమస్యను తక్షణమే పరిష్కరించమని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించామన్నారు.

వాటి ప్రకారం, నీటి పరీక్షలు నిర్వహించి, గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. ఈ చర్యలకు రూ.3.3 కోట్లు నిధులు ఖర్చు చేశారు.

ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలోని వలివర్తిపాడు గ్రామంలో జలాల శాంపిళ్లను పరిశీలించి, నిర్వహణ పనుల పరిస్థితి చూసారు.

పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, “ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం, ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడవద్దు. గత పాలకుల నిర్లక్ష్య చర్యల కారణంగా డయేరియా వంటి వ్యాధులు వ్యాపించాయి.

గ్రామీణ నీటి సరఫరా విభాగం, నిర్దేశిత కాలంలో నిర్వహణ పనులు చేపట్టాలి. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యానికి తగ్గట్లుగా కట్టుబడి పనిచేస్తున్నాము.

గుడివాడ నియోజకవర్గంలో చేపట్టిన విధానాన్ని మోడల్‌గా తీసుకొని, అన్ని గ్రామాల్లో అమలు చేయాలి” అన్నారు.

About Author