“వారీ ఎనర్జీస్ లిమిటెడ్ 2024 అక్టోబర్ 21న ప్రాథమిక పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభం”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 17,2024:వారీ ఎనర్జీస్ లిమిటెడ్ అక్టోబర్ 21, 2024 సోమవారం ప్రారంభం కానున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 17,2024:వారీ ఎనర్జీస్ లిమిటెడ్ అక్టోబర్ 21, 2024 సోమవారం ప్రారంభం కానున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 3,600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. 43.5 లక్షల షేర్లను వారీ సస్టైనబుల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రమోటర్) విక్రయించనుండగా, చందూర్కర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా 4.5 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది.
అక్టోబర్ 23 బుధవారం వరకు ఈ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 18న ఒక రోజు ముందుగానే బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. ఒక్కో షేరుకు ధర శ్రేణి ₹1,427 – ₹1,503 మధ్యలో నిర్ణయించబడింది. కనీసం 9 షేర్లు, ఆపై 9 గుణింతలుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇష్యూలో కొన్ని షేర్లు అర్హులైన ఉద్యోగుల కోసం కేటాయించబడతాయి. షేర్లు బీఎస్ఈ ,ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి.
ఈ ఇష్యూ కోసం యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా, నొమురా, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వంటి సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.