ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో వరద ప్రభావిత వినియోగదారులకు సహాయక చర్యలు ప్రకటించిన “వి”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 6, 2024:ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో వరదల కారణంగా ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రభావితమైన 

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 6, 2024:ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో వరదల కారణంగా ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రభావితమైన  వినియోగదారులకు తోడ్పాటునిచ్చేందుకు వి (Vi) కట్టుబడి ఉంది. ప్రజలు కనెక్టెడ్‌గా ఉండటం, ముఖ్యమైన సమాచారానికి యాక్సెస్ పొందడం కీలకమని గుర్తించి వి ఈ దిగువ పేర్కొన్న చర్యలు ప్రకటించింది:

  • ప్రీపెయిడ్ వినియోగదారులకు వి రోజుకు 1 GB ఉచిత మొబైల్ డేటా 10 నిమిషాల లోకల్+ ఎస్‌టీడీ అవుట్‌గోయింగ్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రయోజనాల వాలిడిటీ 5 రోజుల ఉంటుంది.
  • పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కోసం బిల్లు చెల్లింపు గడువు తేదీలను 7 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వి ప్రకటించింది.

ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు వర్తిస్తాయి.  

ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో స్థానిక అధికారులకు తోడ్పాటు అందించేందుకు వి నెట్‌వర్క్ బృందాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి.

About Author