బహ్రైచ్ అటవీ గ్రామాల్లో వెలుగులు నింపిన సిగ్నిఫై – హర్ గావ్ రోషన్ ప్రాజెక్ట్‌తో 5000కి పైగా వీధిదీపాల ఏర్పాటు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 15, 2025: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో “హర్ గావ్ రోషన్” కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) ప్రాజెక్టు కింద 300కి పైగా అటవీ గ్రామాల్లో సిగ్నిఫై

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 15, 2025: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో “హర్ గావ్ రోషన్” కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) ప్రాజెక్టు కింద 300కి పైగా అటవీ గ్రామాల్లో సిగ్నిఫై సంస్థ సోలార్, ఎల్ఈడి వీధిదీపాలను ఏర్పాటు చేసింది. కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగానికి చెందిన గ్రామాల్లో 5000కి పైగా వీధిదీపాలు వెలుగులిచ్చేలా ఏర్పాటయ్యాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో మానవ-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు తగ్గడమే కాకుండా, ప్రజలు రాత్రివేళల్లో సురక్షితంగా సంచరించగలగడం సాధ్యమైంది. పిల్లలకు విద్యార్ధన, మహిళలకు జీవనోపాధి అవకాశాలు మెరుగయ్యాయి. గ్రామాల్లో వెలుగు తేవడమే లక్ష్యంగా సిగ్నిఫై సంస్థ ఈ కార్యక్రమాన్ని స్థానిక FINISH సొసైటీతో కలసి అమలు చేసింది.

ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కతర్నియాఘాట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ బి. శివ్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ,వన్యప్రాణుల సంరక్షణపై నినాదాలతో కూడిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిగ్నిఫై గ్రేటర్ ఇండియా మార్కెటింగ్, స్ట్రాటజీ, ప్రభుత్వ వ్యవహారాలు, CSR విభాగాధిపతి నిఖిల్ గుప్తా మాట్లాడుతూ – “కాంతి జీవితాలను మార్చే శక్తిగా పనిచేస్తుంది.

మారుమూల గ్రామాల్లో సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ లైటింగ్ ప్రాజెక్టు దోహదపడుతోంది. అటవీశాఖ, FINISH సొసైటీతో కలసి పని చేయడం మాకు గౌరవంగా భావిస్తున్నాం” అని తెలిపారు.

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి అటవీశాఖతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం ప్రధానంగా నిలిచింది.

About Author