ఇనామ్ భూముల సమస్య నుంచి సింగరాయకొండ మండల ప్రజలను ఆదుకోండి:డాక్టర్ నూకసాని బాలాజి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2025: ఈ రోజు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో గౌరవ రెవెన్యూ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2025: ఈ రోజు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో గౌరవ రెవెన్యూ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ సింగరాయకొండ మండలంలోని ప్రజలు ఇనామ్ ల్యాండ్ సంబంధిత సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావడం జరిగింది.

సుమారు 50 సంవత్సరాల క్రితం భూములు కొనుగోలు చేసి, ఇల్లు నిర్మించి నివాసం ఉంటున్న స్థలాల్లో, అవి దేవాదాయ శాఖకు సంబంధించిన పేరుతో రిజిస్ట్రేషన్ కాకుండా అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి.

ఈ విషయాన్ని 2016లో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి స్పందించి, 2019 ఫిబ్రవరి 24న “Inams (Abolition and Conversion into Rythuvari) Amendment Act”ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అయితే, ప్రభుత్వం మరోసారి స్పందించకపోవడంతో, సింగరాయకొండ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు మంత్రి సింగరాయకొండ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ నూకసాని బాలాజీ కోరారు. సింగరాయకొండ ప్రజలు 50 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూములను ఇనామ్ భూముల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రకరకాల అడ్డంకులతో కష్టపడ్డారు.

తదుపరి, గౌరవ మంత్రి అనగాని సత్యప్రసాద్, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రెవెన్యూ సదస్సులో హామీ ఇచ్చారు.

సింగరాయకొండ ప్రజల తరఫున సమస్యను తెరపైకి తెచ్చి, పరిష్కారం కోసం కృషి చేసిన డాక్టర్ నూకసాని బాలాజీ, తన పోరాటం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సింగరాయకొండ ప్రజలు కూడా ఈ అద్భుతమైన చర్యకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author