పిఠాపురం నియోజకవర్గాన్ని పురూహూతిక అమ్మవారు చల్లగా చూడాలి:ఉప ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 30,2024:పిఠాపురం నియోజకవర్గానికి పురూహూతిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని,

వారాహి మీడియా డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 30,2024:పిఠాపురం నియోజకవర్గానికి పురూహూతిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పక్షాన, జనసేన పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారు ఆకాంక్షించారు.

ప్రజలు పాడి పంటలు, సకల సౌభాగ్యాలతో తులతూగాలని కోరారు. శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ తరఫున పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ “పిఠాపురంలో కొలువైన కుక్కుటేశ్వరస్వామి, పురూహూతికా అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రత పూజలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం 6 గంటల నుంచే ఆడపడుచులంతా పూజలో నిమగ్నమయ్యారు.

ఏటా శ్రావణమాసంలో ఒక శుక్రవారం స్థానిక శాసన సభ్యులు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే ఆడపడుచులకు పసుపు, కుంకుమతో పాటు చీర ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని మన ప్రియతమ నాయకులు, ఉప ముఖ్య మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఘనంగా కొనసాగించమని ఆదేశించారు.

పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయమన్నారు. ఇక్కడ వ్రతమాచరించిన ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమ పవన్ కళ్యాణ్ పంపారు. ఒక్కో బ్యాచ్ కు 1500 మంది వరలక్ష్మీ వ్రతం ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రశాంతమైన వాతావరణంలో భక్తిప్రపత్తులతో కన్నుల పండువగా పూజలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము ” అన్నారు.

About Author

You may have missed