రథాలపేట ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు – నాలుగు దశాబ్దాల సమస్యకు ఉపముఖ్యమంత్రి పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: చాలాకాలంగా రథాలపేట ప్రజలను వేధిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు శుక్రవారం శాశ్వత పరిష్కారం దొరికింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: చాలాకాలంగా రథాలపేట ప్రజలను వేధిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు శుక్రవారం శాశ్వత పరిష్కారం దొరికింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడంతో 15 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు లబ్దిదారులకు పట్టాలను అందజేశారు.

రథాలపేట ప్రజలు ఉపముఖ్యమంత్రి పిఠాపురం పర్యటన సమయంలో తమ సమస్యను వివరించగా, వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, కలెక్టర్‌ను ఆదేశించి పట్టాల ప్రక్రియ ప్రారంభించారు. ఆ మేరకు ఎంపికైన లబ్దిదారులకు పట్టాలు అందజేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

ఇది కూడా చదవండి..తహసీల్దార్ కార్యాలయం, వాటర్ వర్క్స్, అన్న క్యాంటిన్ ప్రారంభించిన నాగబాబు

ఈ సందర్భంగా రథాలపేటకు చెందిన లబ్దిదారురాలు కొత్తపల్లి అరుణ మాట్లాడుతూ, “ఇక్కడ నివాసం ఉండి 40 ఏళ్లు అవుతోంది. ఇంతకాలంగా ఎవ్వరూ పట్టించుకోలేదు. మా ఇళ్లలోకి పాములు వస్తున్నా, తాగునీరు లేకపోయినా స్పందించేవాళ్లెవరూ లేరు. పవన్ కళ్యాణ్ ని కలిసిన వెంటనే సమస్య పరిష్కరించారు. నీటి ట్యాపు వేయించి, ఇప్పుడు ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించారు. ఆయన నిజమైన దేవుడు” అని వ్యాఖ్యానించారు.

వసతి గృహ ఆధునీకరణకు శ్రీకారం

ఇదే సందర్భంగా రూ.36.5 లక్షల వ్యయంతో ఆధునీకరించిన బాలికల వసతి గృహాన్ని కూడా నాగబాబు ప్రారంభించారు. బాలికల గదులు, సౌకర్యాలు నూతనంగా అభివృద్ధి చేయగా, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే జేజేఆర్ గ్రూప్ సహకారంతో పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రం వద్ద నిర్మించిన కొత్త బస్ షెల్టర్‌కి కూడా శుభారంభం చేశారు.

ఇది కూడా చదవండి..మనోజ్ కుమార్ మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం

ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కడా చైర్మన్ తుమ్మల రామస్వామి, కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన నేతలు మర్రెడ్డి శ్రీనివాసరావు, పంచకర్ల సందీప్, మురాలశెట్టి సునీల్ కుమార్, పెంకె జగదీష్, దానం లాజర్ బాబు, జయ కృష్ణ, నక్క నారాయణమూర్తి, ఊట ఆది విష్ణు, వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, చెల్లిబోయిన ప్రమీల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

You may have missed