మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రభావం: మహాయుతి కూటమికి విజయకేతనం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 23,2024:జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 23,2024:జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించి అన్ని స్థానాల్లో విజయాన్ని సాధించారు.

- ఆయన డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు, బల్లార్ పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్ పూర్, కస్బాపేట్ నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థుల విజయం కోసం సభలు నిర్వహించి, రోడ్ షోల ద్వారా ప్రచారం చేశారు.
- పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 100% విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.
- ప్రత్యేకంగా లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం సాధించడం ప్రత్యేక విశేషం.
ఇది పవన్ కల్యాణ్ ప్రచారం ప్రభావాన్ని మరోసారి రుజువు చేసింది.