విశాఖ ఉక్కు పరిరక్షణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, గాజువాక ఇంఛార్జ్ కోన తాతారావు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల ఎదుట పరిశ్రమ పరిరక్షణ కోసం బలమైన వాదనలు వినిపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ, పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి కాపాడడానికి చిత్తశుద్ధితో పోరాటం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని ఆయన అభిప్రాయపడ్డారు.

వారి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని చెప్పారు. ఈ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్‌కు వరంగా నిలుస్తుందని కోన తాతారావు పేర్కొన్నారు.
శనివారం స్టీల్ ప్లాంట్ ప్రధాన ముఖద్వారం వద్ద స్వర్గీయ టి. అమృతరావు విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షాన నిలబడి చేసిన కృషి అమోఘం. గాజువాక ప్రజలు, కార్మికులు అందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఈ ఉద్యమానికి మద్దతుగా 3 లక్షల మందితో జరిగిన బహిరంగ సభ, ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కీలక మైలురాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడసాల అప్పారావు, దల్లి గోవింద్ రెడ్డి, గవర సోమశేఖర్, శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని, ఇతర నేతలు, కార్మిక నాయకులు,పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల నాయకులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని, ఆయన స్ఫూర్తి ప్రజల్లోకి విశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు.