కురుడి శివాలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం అరకు నియోజకవర్గంలోని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం అరకు నియోజకవర్గంలోని కురుడి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం… పవన్ కుమారుడు ఆసుపత్రిలో
Read this also…Pawan Kalyan Orders Probe Over Alleged Traffic Delay for JEE Students
స్థానికులైన శ్రీమతి రాములమ్మ, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్‌కు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

గతంలో అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ను కురుడి గ్రామ గిరిజనులు తమ గ్రామ శివాలయంలో దర్శనమివ్వాలని కోరగా, ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి...పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: జగన్
ఇది కూడా చదవండి...పవన్ కుమారుడి గాయాలపై సీఎం చంద్రబాబు, కేటీఆర్ ట్వీట్లు
తరువాత రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధి నిమిత్తం తన వ్యక్తిగత నిధుల నుంచి రూ.5 లక్షలు అందజేస్తానని ప్రకటించారు. పంచాయతీరాజ్, పర్యాటక శాఖలతో కలిసి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.