చిలకల మాడంగి కొండపై గిరిజనుల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 21,2024: బాగుజోల, సిరివర మధ్య తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం, గిరిశిఖర గ్రామాల
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 21,2024: బాగుజోల, సిరివర మధ్య తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం, గిరిశిఖర గ్రామాల వైపు సుమారు కిలోమీటరు దూరం పవన్ కళ్యాణ్ కాలి నడకన చిలకల మాడంగి కొండపైకి ఎక్కారు. అక్కడ నూతనంగా రహదారి నిర్మాణం చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
స్థానిక గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, గిరిజన రైతులు సూరపాడు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పంటలు పండించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సూరపాడు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించి, మధ్యలో నిలిపివేసినట్టు వారు చెప్పారు.
ఈ విషయంపై జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు మాట్లాడారు. కొండ ఎక్కుతూ అక్కడి వ్యూ పాయింట్‌ను చూడడం జరిగింది.
గంజాయి నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమం లో భాగంగా, సాలూరు రేంజ్ అటవీ అధికారులు గంజాయి సాగు నిర్మూలన, రవాణాను నిలువరించడంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.
గంజాయి నిర్మూలన కోసం అటవీశాఖ అధికారులు నిబద్ధతతో పని చేయాలని ఆయన సూచించారు.
థింసా నృత్యం చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు
చిలకల మాడంగి లో పవన్ కళ్యాణ్ కొండ ఎక్కుతూ ఉండగా, గిరిపుత్రులు డప్పులు, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆయనకి స్వాగతం పలికారు. కొండ వాలు వద్ద, సిరివర నుంచి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి వారు సంప్రదాయ థింసా నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలసి పదం కలుపుతూ వారిని ఉత్పాహ పరిచారు.
బాగుజోల బేస్ క్యాంప్ వద్ద మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్
తిరుగు ప్రయాణంలో, బాగుజోల అటవీశాఖ బేస్ క్యాంప్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంపా స్కీమ్‌లో భాగంగా అటవీ అధికారులు తో కలిసి మొక్కలు నాటారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో ఏఏ జాతుల మొక్కలు పెంచబడుతున్నాయో, సాలూరు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు, తదితర అంశాలపై ఆరా తీశారు.
బ్రహ్మరథం పట్టిన గిరిపుత్రులు
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంత పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జిల్లా ప్రజలు, గిరిపుత్రులు ఘన స్వాగతం పలికారు. గజపతినగరం, రామభద్రపురం, సాలూరు, మామిడిపల్లి, మార్కొండపుట్, ఎర్రసామంతువలస తదితర ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నీరాజనాలు పలికారు.
దారిపొడుగునా జనసేన నినాదాలు చేస్తూ, పవన్ కళ్యాణ్ కి జేజేలు పలికారు, పూల వర్షం కురిపించారు. గిరిజన మహిళలు తమ ప్రాంతంలో లభించే పూలతో దండల తయారుచేసి ఆయనకు వేసేందుకు బారులు తీరారు. హారతులతో కొంత మంది మహిళలు ఎదురురాగా, మరికొంత మంది గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపించారు.
జోరువానలోనూ తిరుగు ప్రయాణంలో, ప్రజలు రోడ్లపై గొడుగులతో బారులు తీరారు. స్వాగతానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.