జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20,2024: జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20,2024: జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ తదితరులు కలిశారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నూతన గుర్తింపు కార్డులను జనవరిలో అందజేయాలని కోరిన యూనియన్ నాయకులు, సమస్యల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలపై తమ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఇతర సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించి పరిష్కారం కనుగొంటానని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు చావ రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author