“ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విడుదల”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై ,అక్టోబర్ 4,2024: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ (MMT)తో భాగస్వామ్యం చేసుకుని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై ,అక్టోబర్ 4,2024: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ (MMT)తో భాగస్వామ్యం చేసుకుని ఐసిఐసిఐ బ్యాంక్, ఔత్సాహిక ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది.

ఈ అత్యుత్తమ ఫీచర్‌లతో కూడిన మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అపరిమిత రివార్డ్‌లతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కార్డ్ “మై క్యాష్” (మేక్ మై ట్రిప్ ,రివార్డ్ కరెన్సీ)తో ప్రత్యేక విలువను అందిస్తుంది. ఇది వర్తించే మేక్ మై ట్రిప్ డిస్కౌంట్‌లతో పాటు హోటల్ బుకింగ్‌లపై 6% మై క్యాష్, విమానాలు, సెలవులు, క్యాబ్‌లు , బస్సులపై 3% మై క్యాష్,ఇతర రిటైల్ ఖర్చులపై 1% రివార్డ్‌లను అందిస్తుంది.
ఈ సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులకు, ముఖ్యంగా ప్రయాణ ప్రేమికులకు ఆకర్షణీయమైన రివార్డులతో సరికొత్త క్రెడిట్ కార్డ్‌ను పరిచయం చేయడానికి మేక్ మై ట్రిప్‌తో భాగస్వామ్యం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము.

ఈ కార్డ్ మాస్టర్ కార్డ్,రూపే ద్వారా రెండు రకాలుగాను అందించబడుతుంది. మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎప్పటికీ గడువు ముగియని రివార్డులతో పాటు ఎంఎంటి బ్లాక్ గోల్డ్ మెంబర్‌షిప్‌ను అందించడం ద్వారా ప్రయాణికులకు ఆదర్శవంతమైన ఎంపికగా మారుతుంది. ఇది ఇప్పటికే ఉన్న మా క్రెడిట్ కార్డ్‌ల శ్రేణికి మరో ఉత్తమ జోడింపు” అని తెలిపారు.
మేక్ మై ట్రిప్ కో-ఫౌండర్,గ్రూప్ CEO రాజేష్ మాగో మాట్లాడుతూ, “మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇది మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలిచే విలువ ప్రతిపాదనను అందించడం ద్వారా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పనుంది. భారతీయ కస్టమర్‌పై మా లోతైన అవగాహన ఆధారంగా, ఎప్పటికీ గడువు ముగియని రివార్డ్ పాయింట్లు,కాంప్లిమెంటరీ ఎంఎంటి బ్లాక్ గోల్డ్ మెంబర్‌షిప్‌తో కూడిన ఈ కార్డ్‌ను పరిచయం చేసాము” అని చెప్పారు.

మాస్టర్‌కార్డ్ సౌత్ ఏషియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ, “ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఎదుగుదల భారతీయుల్ని అత్యధికంగా ప్రయాణించే వ్యక్తులలో మార్చింది, ఖర్చులు అనుభవపూర్వకమైన ప్రయాణాల వైపు మళ్లాయి. గత అక్టోబర్‌లో ‘ప్రైస్‌లెస్ ఇండియా’ని ప్రారంభించిన తర్వాత, మాస్టర్‌కార్డ్ తమ కార్డ్ హోల్డర్‌ల కోసం చిరస్మరణీయమైన క్షణాలను సృష్టించడంపై దృష్టి సారించింది. ఐసిఐసిఐ బ్యాంక్,మేక్ మై ట్రిప్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా, 210 దేశాల్లో అమూల్యమైన అనుభవాలను సృష్టించడంలో సహాయపడే కార్డ్‌ను విడుదల చేయటం పట్ల మాస్టర్‌కార్డ్ ఉత్సాహంగా ఉంది” అని అన్నారు.
NPCI చీఫ్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్, రజీత్ పిళ్లై మాట్లాడుతూ, “రూపే శక్తితో కూడిన మేక్ మై ట్రిప్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ప్రయాణ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అసమానమైన ప్రయోజనాలు,రివార్డ్‌లను అందిస్తుంది. అదనంగా, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్‌లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ని యుపిఐ ఐడికి లింక్ చేయవచ్చు, తద్వారా సురక్షితమైన లావాదేవీలను నేరుగా ప్రారంభించవచ్చు” అని తెలిపారు.