ఆంధ్రప్రదేశ్ ఐఎంఏకి జాతీయ స్థాయి పురస్కారాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 99వ జాతీయ మహాసభలలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 99వ జాతీయ మహాసభలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన పలువురు సభ్యులు గౌరవప్రదమైన జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

నంద్యాలకు చెందిన ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుర్రాల రవికృష్ణ సామాజిక సేవలకు గాను డాక్టర్ జ్యోతి ప్రసాద్ గంగూలి స్మారక పురస్కారం అందుకున్నారు. నంద్యాలకి చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదనరావు జాతీయ జీవితకాల సాఫల్య పురస్కారం పొందారు.

తిరుపతికి చెందిన మాజీ జాతీయ సీజీపీ డీన్ డాక్టర్ రాయపు రమేష్, ఐఎంఏ జాతీయ స్థాయిలో చేసిన విశేష సేవల కోసం డాక్టర్ ఏకేఎన్ సిన్హా పురస్కారం అందుకున్నారు.

గత రెండు సంవత్సరాలుగా ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ సేవలందించిన డాక్టర్ పోలవరపు ఫణిధర్ ప్రశంసలు పొందారు. అత్యధిక రక్తదాతలతో రక్తదాన శిబిరం నిర్వహించిన కావలి ఐఎంఏ పురస్కారం అందుకుంది. ఉత్తమ నగర శాఖ కార్యదర్శిగా గుంటూరుకు చెందిన డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గౌరవించబడారు.

మహిళా విభాగం సేవల కోసం అనంతపురానికి చెందిన ఐఎంఏ మాజీ మహిళా విభాగ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, రాజమండ్రి ఐఎంఏ శాఖ కార్యదర్శి డాక్టర్ పిడుగు విజయభాస్కర్ జాతీయ అధ్యక్షుని ప్రత్యేక ప్రశంసా పురస్కారాలు అందుకున్నారు.

ఈ పురస్కారాలను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోకన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ నాయక్, నూతన అధ్యక్షుడు డాక్టర్ బానుషౌలి అందజేశారు.

ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, జాతీయ సీజీపీ డీన్ డాక్టర్ వి.ఎస్. ప్రసాద్, జాతీయ మాజీ ఉపాధ్యక్షులు శ్రీహరి రావు, రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ పి.ఎస్. శర్మ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ కిషోర్, డాక్టర్ మూర్తి, డాక్టర్ శ్రీనివాస్ రాజు, డాక్టర్ సుబ్రహ్మణ్యం అభినందించారు.

About Author