“ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో బాధితుల సమావేశం: న్యాయాన్ని కోరుతూ వినతి”
వారాహి మీడియా డాట్ కామ్,విజయవాడ,సెప్టెంబర్ 27, 2024:విజయవాడ 38వ డివిజన్, కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి, ఇటీవల

వారాహి మీడియా డాట్ కామ్,విజయవాడ,సెప్టెంబర్ 27, 2024:విజయవాడ 38వ డివిజన్, కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి, ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శుక్రవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందించారు.

నసీమాతోపాటు నగీనా, విజయ, భవాని, సుధారాణి తదితరులు కలిసి తమ బాధలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ తమ ప్రాంతం వరదల వల్ల ప్రభావితం కాలేదని అధికారులను తప్పుదోవ పట్టించారని, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ బాధితుల కథనం విన్న వెంటనే స్పందించి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు తక్షణమే సమాచారం పంపారు. నసీమా, నగీనా, ఇతర మహిళలు చెప్పిన సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.