పాత్రికేయుడు ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలి:పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 26,2024:ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం కలిగిన పాత్రికేయులు తన్నీరు ఆదినారాయణ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 26,2024:ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం కలిగిన పాత్రికేయులు తన్నీరు ఆదినారాయణ గారు మరణం బాధాకరం. ఈటీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ గా బాధ్యతల్లో ఉన్న ఆదినారాయణ కి వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉంది.
ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించాను. ఇంతలో మరణ వార్త వచ్చింది. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.