స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 26, 2024 : స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో కాలేయ సంరక్షణ,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 26, 2024 : స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో కాలేయ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు.

హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి, ప్రపంచస్థాయి సదుపాయాలతో రూపొందించిన ఈ ఇన్‌స్టిట్యూట్‌కు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం ఎంతో గర్వకారణం. లివర్ మన శరీరానికి అత్యంత ముఖ్యమైన అవయవం.

ఇలాంటి ముఖ్యమైన విభాగానికి ప్రత్యేకమైన సంరక్షణ అందించేందుకు ఈ ఇన్‌స్టిట్యూట్ రూపొందించడం ప్రజల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం.

డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి బృందానికి నా హృదయపూర్వక అభినందనలు” అని ఆయన అన్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్ కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదుగుతుంది” అని రాజమౌళి తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచస్థాయి లివర్ సంరక్షణ ,ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి రావడం, అత్యుత్తమ వైద్యసేవలు అందించబోవడం అనే విషయాన్ని నిర్వాహకులు తెలిపారు.

ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎస్ఎస్ రాజమౌళికి, ఇన్‌స్టిట్యూట్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్, డైరెక్టర్ డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గుడపాటి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హాజరైన ప్రముఖులు, వైద్య నిపుణులు, ఇతర అతిథులు ఆసుపత్రి సౌకర్యాలు, వైద్య సేవలను ప్రశంసించారు.

About Author