తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీ ప్రారంభం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 2,2024: గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 2,2024: గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీసుకున్న తీర్మానాన్ని అమలు చేస్తూ, సోమవారం తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుపతి ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులుతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, “స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించేందుకు టీటీడీ బోర్డు మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. శ్రీవేంకటేశ్వరుని దర్శనాన్ని పొందే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు” అని అన్నారు.
అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు, “తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన స్థానికులకు ప్రత్యేక దర్శన కోటాను ఖరారు చేయడంలో టీటీడీ అధికారులు కృషి చేశారు.
సాధారణ భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, స్థానికుల దర్శన కోటాను పునరుద్ధరించడం జరిగిందని” చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం,ఇతర అధికారులు పాల్గొన్నారు.