రాజకీయాల కంటే పిజ్జా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్న భారత్: ‘ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్’ వెల్లడి..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గురుగ్రామ్, ఆగస్టు 1, 2025: దేశంలోని ప్రజలు ఇప్పుడు రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడానికన్నా రెస్టారెంట్‌లో పిజ్జా ఎంచుకోవడాన్ని ఎక్కువగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గురుగ్రామ్, ఆగస్టు 1, 2025: దేశంలోని ప్రజలు ఇప్పుడు రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడానికన్నా రెస్టారెంట్‌లో పిజ్జా ఎంచుకోవడాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు! ఇది ఫన్ అనిపించవచ్చు, కానీ సెంటర్ ఫ్రెష్ ,యూగోవ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా ‘ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్’లో ఈ నిజం బయటపడింది. రోజూ మనం ఎదుర్కొనే చిన్న విషయాలు కూడా భారత్‌లో ప్రజలలో తీవ్ర ఆలోచనలకి కారణమవుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.
తక్కువ విషయాల్లో ఎక్కువ ఆలోచనలు!
ఈ అధ్యయనం ప్రకారం, 81% మంది భారతీయులు రోజుకి కనీసం మూడు గంటలపాటు ఓవర్‌థింకింగ్ చేస్తారట. వాట్సాప్ మెసేజ్‌కి రిప్లై ఎలా ఇవ్వాలి, భోజనానికి ఏమి ఆర్డర్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ఫోటో పెట్టాలి లాంటి చిన్న విషయాలపైనా వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దేశమంతా, అన్ని వయస్సులు, వర్గాల మధ్య ఈ ఆవేశపూరిత ఆలోచనల అలవాటు విస్తరించింది.
బాస్ “ఓకే” అంటేనే ఆందోళన
42% మంది ఉద్యోగులు బాస్ “ఓకే” అని మాత్రమే మెసేజ్ పంపితే వెంటనే దాన్ని నెగటివ్‌గా తీసుకుంటున్నారు. మహిళలు (42%), పురుషులు (41%) ఇలా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న మెసేజ్‌లే పెద్దగా మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి.

పొలిటిక్స్ కన్నా ఫుడ్ ఎంపికే హార్డ్!
63% మంది భారతీయులు రెస్టారెంట్‌లో డిష్ ఎంపిక చేయడమే ఓటింగ్ కన్నా కష్టంగా అనిపిస్తుందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఇది 69%కి పెరిగింది. అంటే, రోజువారీ సాధారణ నిర్ణయాలే భారతీయుల్ని ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.
సోషల్ మీడియా: స్టోరీలోనూ స్ట్రెస్!
జెన్ జెడ్ మరియు మహిళలు ఎక్కువగా సోషల్ మీడియా స్టోరీలు పోస్ట్ చేయడం గురించి రోజుకి కనీసం ఐదు గంటలపాటు ఆలోచిస్తున్నారు. ఫోటో మంచిదా? మ్యూజిక్ ఎలా ఉండాలి? వ్యూస్ వస్తాయా? ఇలా అన్నింటిపై ఆందోళన కొనసాగుతోంది. 60% మందికి పైగా ఇతరుల స్టోరీలు వెంటనే చూడకుండా ఆలస్యం చేయడానికి ఈ మానసిక ఒత్తిడే కారణం.
ఓవర్‌థింకింగ్‌కు థెరపిస్ట్‌లు: గూగుల్ & చాట్‌జీపీటీ!
ఇప్పుడు మన థెరపిస్ట్‌లు మన చేతిలో ఉన్న ఫోన్లలోనే ఉన్నారు! ప్రతి 3 మందిలో ఒకరు ఓవర్‌థింకింగ్ సమయంలో గూగుల్ లేదా చాట్‌జీపీటీని అడుగుతున్నారని ఈ రిపోర్ట్ చెబుతోంది. చిన్న డెసిషన్స్ నుంచి , సందేహాల పరిష్కారం వరకూ – టెక్నాలజీపై ఆధారపడటం పెరిగిపోయింది.

“దిమాగ్ పై పెట్టండి లగామ్” – సెంటర్ ఫ్రెష్ సందేశం
పర్ఫెట్టీ వాన్ మెల్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ గుంజన్ ఖేతన్ మాట్లాడుతూ, “ఓవర్‌థింకింగ్ అనేది ఇప్పుడు సాధారణమైన సమస్యగా మారింది.
మనం చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కువగా ఆలోచిస్తూ, మనసు మురికికి గురవుతోంది. ఇదే సమయంలో, సెంటర్ ఫ్రెష్ తన మింటీ కూలింగ్‌తో ఆ ఓవర్‌థింకింగ్‌ను బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఉంది. మనం మన భావోద్వేగాలను విశ్వసించాలి. సందేహం వస్తే… ‘దిమాగ్ పై పెట్టండి లగామ్!’”