మంగా, అనిమే స్టడీస్ విశ్వవిద్యాలయం కియోటో సేకా యూనివర్సిటీతో IACG అవగాహన ఒప్పందం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, సెప్టెంబర్ 8, 2025 భారతదేశంలో మల్టీమీడియా గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లను మొదటిసారిగా ప్రారంభించిన IACG

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, సెప్టెంబర్ 8, 2025 భారతదేశంలో మల్టీమీడియా గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లను మొదటిసారిగా ప్రారంభించిన IACG మల్టీమీడియా కళాశాల, జపాన్‌లోని మంగా & అనిమే స్టడీస్‌లో ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయం కియోటో సేకా యూనివర్సిటీతో పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనుంది. ఈ MoU బుధవారం హైదరాబాద్‌ T-Hubలో, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దాసోజు శ్రీధర్ బాబు సమక్షంలో జరగనుంది.

ఈ ఒప్పందాన్ని IACG వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ పొలిన, కియోటో సేకా యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాంటెంపరరీ ఆఫ్రికన్ & ఏషియన్ కల్చర్స్ డైరెక్టర్ షిన్ మత్సుమురా పరస్పరం మార్పిడి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని IACG CEO & ప్రిన్సిపల్ డా. సురేష్ మదిరాజు, IACG అకాడెమిక్స్ హెడ్ చైతన్య CH ఎఫ్‌టీసీసీఐ (FTCCI), రెడ్ హిల్స్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు.

ఒప్పందం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు:

  • భారత్–జపాన్ విద్యార్థులు & అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు
  • తెలంగాణలో ప్రపంచస్థాయి బోధన, పరిశ్రమ అనుసంధానం
  • JETRO (Japan External Trade Organisation) సహకారంతో అవుట్‌సోర్సింగ్ & టాలెంట్ అవకాశాలు
  • మంగా & అనిమే రంగంలో తెలంగాణ విద్యార్థులకు గ్లోబల్ ప్లేస్‌మెంట్ అవకాశాలు

జపాన్ యానిమేషన్ రంగం ప్రపంచ మార్కెట్లో 60% వాటాతో అగ్రస్థానంలో ఉంది. USD 25 బిలియన్ విలువ గల అనిమే పరిశ్రమలో, ప్రతి సంవత్సరం 1,000కుపైగా మంగా టైటిల్స్, 300+ అనిమే సీజన్లు వస్తున్నాయి. అయితే, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత జపాన్‌ను ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితుల్లో భారతీయ ప్రతిభకు పెద్ద డిమాండ్ ఉంది.

“హైదరాబాద్‌లోని బలమైన ఐటీ ఎకోసిస్టమ్‌, వేగంగా ఎదుగుతున్న క్రియేటివ్ ఇండస్ట్రీలతో, తెలంగాణ ప్రపంచ మంగా & అనిమే నైపుణ్యానికి గ్లోబల్ హబ్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉంది” అని డా. సురేష్ మదిరాజు తెలిపారు.

“JETRO జపాన్ స్టూడియోలతో భాగస్వామ్యాలు, ప్లేస్‌మెంట్‌లు, అవుట్‌సోర్సింగ్ అవకాశాలను చురుకుగా కల్పిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ క్రియేటివ్ టాలెంట్ ఎగుమతిలో కీలకమైన ముందడుగు వేసింది” అని రామకృష్ణ పొలిన పేర్కొన్నారు.

Read This also…IACG to Sign MoU with Kyoto Seika University, Japan – World’s First University for Manga & Anime Studies..

ఈ భాగస్వామ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, హైదరాబాద్ కూడా పాలుపంచుకోనుంది. దీని ద్వారా భారత క్రియేటివ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

IACG – కియోటో సేకా యూనివర్సిటీ – JETRO – భాగస్వామ్య స్టూడియోలు కలసి, తెలంగాణను ప్రపంచ క్రియేటివ్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడం, పెట్టుబడులు, ఉద్యోగాలు సృష్టించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

About Author